Share News

జగ్జీవన్‌ రామ్‌, అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:44 PM

మహనీయులు బాబు జగ్జీవన్‌ రామ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందు కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

జగ్జీవన్‌ రామ్‌, అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి

సిరిసిల్ల, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : మహనీయులు బాబు జగ్జీవన్‌ రామ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందు కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జగ్జీవన్‌ రామ్‌, 14వ తేదీన బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సన్నా హక సమావేశం నిర్వహించారు. ఈ సందరభంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. మహనీయులు బాబు జగ్జీవన్‌ రామ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ భారత దేశ నిర్మాణంలో అందించిన విశేష సేవలను స్మరించుకునేందుకు ఏటా వారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మహనీయు లు అందరి వారని పేర్కొన్నారు. ఆయా మహనీయుల జయంతి సంద ర్భంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఉన్న వారి విగ్రహాల వద్ద పారిశుధ్య పనులు ప్రతి రోజూ చేయించాలని సూచించారు. వేడుకలకు ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో జయంతి వేడుకలకు ఘనమైన ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని సూచించారు. సెస్‌ అధికారులు విద్యుత్‌ సర ఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని, జిల్లా వైద్యాధికారి వైద్యులు, సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థుల హాస్టల్‌ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అన్ని రెసిడెన్షియల్‌, హాస్టళ్లలో గీజర్‌ సదుపాయం కల్పించామని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, సౌక ర్యాల పరిశీలనకు అన్ని రెసిడెన్షియల్‌, హాస్టల్స్‌, స్కూళ్లకు మండల, జిల్లా స్థాయి అధికారులను నియమించామని పేర్కొన్నారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న, జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, ఉద్యా నవన శాఖ అధికారి శరత్‌ బాబు, పోలీస్‌ అధికారులు, వివిధ సంఘా ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:44 PM