Share News

Jagityala: చింతకుంట చెరువులోకి మురుగు వరద

ABN , Publish Date - Sep 07 , 2026 | 12:46 AM

జగిత్యాల టౌన్‌, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ట్యాంక్‌ బాండ్‌గా పేరొందిన చింతకుంట చెరువు మురుగు నీటితో కంపు కొడుతోంది.

Jagityala:  చింతకుంట చెరువులోకి మురుగు వరద

జగిత్యాల టౌన్‌, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ట్యాంక్‌ బాండ్‌గా పేరొందిన చింతకుంట చెరువు మురుగు నీటితో కంపు కొడుతోంది. పట్టణంలోని ప్రధానమురికి కాలు వల నుంచి వస్తున్న మురుగునీరు నేరుగా చెరువులోకి చేరుతుండటంతో కలుషితమవుతోంది. మరోవైపు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం పెద్దఎత్తున చెరువులోకి చేరి గుట్ట లుగా పేరుకుపోతున్నాయి. దీంతో చింతకుంట చెరువు అధ్వానంగా మారింది.

నేరుగా చెరువులోకి మురుగు నీరు...

పట్టణంలోని బీట్‌బజార్‌, ఎల్‌ఎల్‌ గార్డెన్‌, ఇస్లాంపూర నుంచి వస్తున్న ప్రధాన మురుగునీటి నాలాకు గండిపడి నేరుగా మురుగునీరు చింతకుంట చెరువులోకి చేరుతున్నది. లింగపేట, తులసీనగర్‌ నుంచి వచ్చే మరో మురికి కాలువను నేరుగాచెరువులోనే వదిలివేశారు. దీనిపైపట్టణప్రజలు, మత్స్య కారులు, కౌన్సిల్‌సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఇప్పటివరకు శాశ్వతపరి ష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లో దుర్వాసన వెదజల్లడంతో అక్కడ నివసించే ప్రజ లతో పాటు ఆ రోడ్డు వెంటవెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు.

చేపలు మృతి.. మత్స్యకారుల్లో ఆందోళన..

చెరువు నీరు కలుషితం కావడంతో ఇప్పటికే పెద్దసంఖ్యలో చేపలు మృతిచెందాయి. చేపల పెంపకంపై ఆధారపడే మత్స్య కారులకు ఇదితీవ్రనష్టాన్ని కలిగిస్తోంది. చెరువులోకి మురుగు నీరు చేరకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చేపల మృతికి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిమజ్జనాలపై భక్తుల్లో ఆందోళన..

వినాయకచవితి, బతుకమ్మ పండుగలు సమీపిస్తున్న నేప థ్యంలో చింతకుంటచెరువు పరిస్థితి మరింత చర్చనీయాం శంగా మారింది. మురుగు నీటితో కంపు కొడుతున్న చెరు వులో వినాయక విగ్రహాలు, బతుకమ్మలను ఎలా నిమజ్జనం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంపై ప్రభావం..

బతుకమ్మ, వినాయక నిమజ్జనం సమయంలో భక్తులు చెరువు నీటిని తాకడం, చేతులు కడుక్కోవడం, నీటిని చల్లుకోవడం వంటివి చేస్తుం టారు. కలుషిత నీటితో చర్మ సంబంధిత సమస్యలు, ఇతర అనా రోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనాలకు ముందే నీటి నాణ్యతను పరీక్షించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిధులు కేటాయించినా..

వినాయక చవితి, బతుకమ్మ పండుగల ఏర్పాట్ల కోసం మున్సిపల్‌ నుంచి నిధులు కేటాయించినప్పటికీ చింతకుంట చెరువులోకి మురుగు నీరు చేరకుండా అడ్డుకట్ట వేసే పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని స్థానికులు విమర్శిస్తున్నా రు. పండుగలు దగ్గరపడుతున్నా అధికారులు స్పందించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ మురుగునీటిని అరికట్టాలి..

గాజుల రాజేందర్‌, మాజీ కౌన్సిలర్‌

చింతకుంట చెరువులో వినాయక విగ్ర హాలు, బతుకమ్మలను నిమజ్జనం చేస్తాం. అలాంటి చెరువు మురికికూపంగా మార కుండా పరిరక్షించాలి. ఉత్సవాలకు ముందే మురికికాలువలకు అడ్డుకట్టవేసి, నీటినిశుభ్రపరచాలి. చేపలు మృతితో నష్టపోయినమత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి.

ఫ చర్మవ్యాధులు వస్తాయి..

సిరికొండ శ్రీనివాస్‌, బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్‌

వినాయక విగ్రహాలను, బతుకమ్మలను నిమజ్జనం చేసి ఆ నీటిలోనే చేతులు కడుక్కోవడం, ఒకరిపై మరొకరు చల్లుకో వడం జరుగుతుంది. ఇలాంటి నీటిని చల్లుకుంటే చర్మ వాధులు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Sep 07 , 2026 | 12:46 AM