Share News

Jagityala: విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:38 PM

వెల్గటూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

Jagityala:  విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట
కుమ్మరిపల్లి మోడల్‌స్కూల్‌లో మాట్లాడుతున్న ఎంపీ వంశీకృష్ణ

- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

వెల్గటూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్‌ స్కూల్‌కు విశాఖ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా బెంచీలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్య అభివృద్ధికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తోందని తెలిపారు. స్టార్టప్‌ ఇన్నోవేటివ్‌ ఐడియా లతో విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. స్కూల్‌గ్రౌండ్‌ కావాలని విద్యార్థులు కోరారని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి గ్రౌండ్‌స్థలం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. అదనపు తరగతుల గదులు, క్రీడామైదానంతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయని తనదృష్టికి వచ్చిందని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.10లక్షలు నిధులు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్‌ క్రియేటర్‌ నిరుపేద విద్యార్థి వెంకటేష్‌కు రూ.25వేలు ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. అంతకుముందు పాఠశాల అధ్యాపకులు, విద్యా ర్థులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎండ పల్లి మండలం గుల్లకోట గౌడ సంఘ భవనం ప్రహరీ, ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.10లక్షల ప్రొసీడింగ్‌ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సందీప్‌రాజు, వైస్‌ప్రిన్సిపాల్‌ కృష్ణప్రసాద్‌, సర్పంచ్‌ జక్కుల ఆమని, తహశీల్దార్‌ శేఖర్‌, ఎంఈవో ప్రభాకర్‌, సర్పంచ్‌లు బిల్లకూరి తిరుపతి, రాజయ్య, మల్లేశం, సుమన్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:38 PM