Share News

సీఎం సహకారంతో జగిత్యాలకు అత్యధిక నిధులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:35 AM

ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సహకారంతో జగిత్యాలకు అత్యధిక నిధులు మంజూరు చేయించినట్లు జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని 3, 4 వార్డుల్లో రూ. 35 లక్షల తో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.

సీఎం సహకారంతో జగిత్యాలకు అత్యధిక నిధులు
జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌

జగిత్యాల టౌన, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సహకారంతో జగిత్యాలకు అత్యధిక నిధులు మంజూరు చేయించినట్లు జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని 3, 4 వార్డుల్లో రూ. 35 లక్షల తో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శుక్రవారం మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకు సీఎంను కలిసి జగిత్యాల అభివృద్ధి కోసం వినతిప త్రం అందజేశానని గుర్తుచేశారు. ఈమేరకు అభివృ ద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ ఏఈ అనిల్‌, మాజీ కౌన్సిలర్‌ క్యాదాసు నవీన, రంగు మహేష్‌, ఈశ్వర్‌ మతీన, ప్రసాద్‌ గౌడ్‌, రాములు, అశోక్‌ పాల్గొన్నారు.

- టీజీఎస్‌ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవ త్సర డైరీని జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కార్యా లయంలో ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌కు సం ఘం నాయకులు శుక్రవారం అందజేశారు. కార క్ర మంలో జిల్లా అధ్యక్షుడు కంటాల రవీందర్‌, కార్యద ర్శి కస్తూరి సత్తయ్య, ఉపాధ్యక్షుడు కస్తూరి సత్య సుధాకర్‌, డిపో అధ్యక్షకార్యదర్శులు కటారి హరిప్రకాశ రావు, జక్కని రాజేశం, జిల్లా జాయింట్‌ సెక్రెటరీ అనుమల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

జగిత్యాల అర్బన: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది ప్రజలు గమనిస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నా రు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని దరూర్‌ క్యాంప్‌లోని కస్తూర్బా పాఠశాలలో 80 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల గదులతో పాటు మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేశారు. జిల్లా విధ్యాదికారి రాము, ఎంఈవో చంద్రకళ, ప్రిన్సి పాల్‌ కవిత, డీఈ సత్యనారాయణ, మాజీ మున్సిప ల్‌ చైర్మన అడువాల జ్యోతి, గిరి నాగభూషనం, గోలి శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్లు పాలొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:35 AM