Share News

jagityaala : అవనిపై హరివిల్లు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:42 AM

జగిత్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్‌ హైస్కూల్‌ వేదికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో

jagityaala :  అవనిపై హరివిల్లు

-‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన

-ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసిన మహిళలు, యువతులు

-విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన అదనపు కలెక్టర్‌ లత

జగిత్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్‌ హైస్కూల్‌ వేదికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్‌ బై సన్‌ ఫీస్ట్‌ మ్యాజిక్‌ మమ్స్‌ బిస్కట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌ వాసి అంగరబత్తీ స్థానిక స్పాన్సర్స్‌ జ్యోతి హైస్కూల్‌, మానస స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, స్థానిక పార్ట్‌నర్‌ జ్యోతి హైస్కూల్‌, మానస స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, యశస్విని ఎంటర్‌ ప్రైజెస్‌ నిర్వాహకులు కోటగిరి శ్రీనివాస్‌, ఆర్‌టీఏ జిల్లా సభ్యుడు కంటాల శ్రీనివాస్‌, అరుణి హాస్పిటల్‌ నిర్వాహకులు ఆగంతపు నరేశ్‌, దుబాయి ఎల్లాల శ్రీనివాస్‌ సేవా సమితి, ఎస్‌ఎల్‌ మార్ట్‌ సహకారాలతో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 199 మంది మహిళలు, చిన్నారులు, విద్యార్థినులు హాజరై అవనికి రంగులు అద్దారు. పట్టణంలోని సూర్య గ్లోబల్‌ హైస్కూల్‌ ఆవరణలో జరిగిన పోటీల్లో మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. పోటీలో పాల్గొని గెలుపొందిన విజేతలకు జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, జ్యోతి, సూర్య, మానస ఎక్స్‌లెన్స్‌ పాఠశాలల డైరెక్టర్లు బోయినిపల్లి శ్రీధర్‌ రావు, అజితరావు, మానస ఎక్స్‌లెన్స్‌ ప్రిన్సిపాల్‌ బోయినిపల్లి రజిత రావులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు.

ఫ విజేతలు

మొదటి బహుమతి కింద తుమ్మనపల్లి అనిలాకు రూ.6వేలు, రెండవ బహుమతి కింద మండేలోజి శైలజకు రూ.4వేలు, మూడవ బహుమతి కింద నీలం నిషిత లక్ష్మీకి రూ.3వేలు అందజేశారు. 199 మందికి కన్సోలేషన్‌ బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా పాఠశాల డైరెక్టర్‌ రజితారావు, ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ కల్పన, పీఈటీ జమున వ్యవహరించారు.

మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం అభినందనీయం

-అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడానికి ముగ్గుల పోటీలు దోహదపడుతాయని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత అన్నారు. ఇళ్ల ముందు వేసుకునే ముగ్గులు మహిళల ఆలోచనా విధానానికి అద్దం పడతాయని ఆమె అన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా రంగురంగుల ముగ్గులు కనిపించేవని, ఇప్పుడు అంతగా కనిపించడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్‌ రోడ్లు రావడం వల్ల ఎవరూ అంతగా ముగ్గులు వేయడం లేదని పేర్కొన్నారు. తాను చిన్నతనంలో వేళ్లతో ముగ్గులు వేసిన సన్నివేశాలను చూశానని, సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటి ఎదుట గొబ్బెమ్మలు కనిపించేవని అన్నారు. కనుమరుగవుతున్న తెలుగు మహిళల సాంప్రదాయాన్ని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ కాపాడే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రంగురంగుల ముగ్గులు వేయడం, వారి ఆలోచనా విధానాన్ని ముగ్గు రూపంలో ఆవిష్కరించడం గొప్ప కల అని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ ముక్క వేణుగోపాల్‌ అధ్యక్షత వహించగా, జగిత్యాల టౌన్‌ రిపోర్టర్‌ అంజయ్య, ధర్మపురి రిపోర్టర్‌ మురళీ, కొడిమ్యాల రిపోర్టర్‌ రాములు, గొల్లపల్లి రిపోర్టర్‌ బొల్లె రాజన్న, మెట్‌పల్లి టౌన్‌ రిపోర్టర్‌ పెరుమాండ్ల స్వామి గౌడ్‌, పెగడపల్లి రిపోర్టర్‌ శాంతపురావు, రాయికల్‌ రిపోర్టర్‌ వేణుగోపాల్‌, వెల్గటూరు రిపోర్టర్‌ పురుషోత్తం, జగిత్యాల అగ్రికల్చర్‌ రిపోర్టర్‌ ప్రదీప్‌, జగిత్యాల రూరల్‌ రిపోర్టర్‌ గంగాధర్‌, జగిత్యాల అర్బన్‌ రిపోర్టర్‌ వేముల సంతోష్‌, భీమారం రిపోర్టర్‌ గణేష్‌, మల్యాల రిపోర్టర్‌ శ్రీమాన్‌, ఎండపల్లి రిపోర్టర్‌ శ్రావణ్‌, ఏబీఎన్‌ కెమెరామెన్‌ శ్రీనివాస్‌, ఏడీవీటీ ఇన్‌చార్జి రాజు, నాయకులు గంప శ్రీనివాస్‌, గుంటుక మహేశ్‌లు పాల్గొని కన్సోలేషన్‌ బహుమతులను అందజేశారు.

Updated Date - Jan 05 , 2026 | 01:42 AM