Jagitial: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:28 PM
జగిత్యాల అర్బన్, అక్టోబరు 30 (ఆంఽధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని ఆ లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గుజ్జుల సుజాత అన్నారు.
జిల్లా వైద్యాధికారి సుజాత
జగిత్యాల అర్బన్, అక్టోబరు 30 (ఆంఽధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని ఆ లక్ష్య సాధనకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గుజ్జుల సుజాత అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన నిషా ముఖ్త్‌భారత్‌లో మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండి దానిని సాధించేందుకు నిరంతరం క్రమశిక్షణతో కృషిచేయాలని సూచించారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేసేవారు మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని తెలిపారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు విద్య, కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం, భవిష్యత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు అంకం గోవర్ధన్, కె శ్రీనివాస్, కె సురెందర్, బి కవిత, సుప్రియ, నరేష్, రజిత, మహేష్ పాల్గొన్నారు.
రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వెల్ఫేర్ అధికారి భాస్కర్(06........ఐబిఎంపి30)
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
- జిల్లా వెల్ఫేర్ అధికారి భాస్కర్
ఇబ్రహీంపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెనూప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని జిల్లా వెల్ఫేర్ అధికారి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. రికార్డులను తనిఖీ చేశారు. వంటశాల, సరుకులను, విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ హరీష్, ప్రత్యేక అధికారి రజిత పాల్గొన్నారు.