Share News

jagitial : వరికి బదులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలి

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:50 PM

మల్లాపూర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతులు వరికి బదులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ అన్నారు.

jagitial :  వరికి బదులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలి
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌

- జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌

మల్లాపూర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతులు వరికి బదులు ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని పాతదాంరాజుపల్లి గ్రామంలోని రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ప్రయోజనాలు కలుగుతా యన్నారు. డ్రిప్‌, స్ర్పింక్లర్‌ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో వాతావరణం పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగుచేసి రైతులు నష్టాల బారిన పడొద్దని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేందుకు జలసిరి పథకం, ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఆత్మ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:52 PM