jagitial : గైనకాలజిస్ట్ సేవలను పెంచాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:49 PM
రాయికల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ సేవలను పెంచాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ సేవలను పెంచాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వసతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నిధుల మంజూరు కృషిచేస్తానని అన్నారు. రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన మేర సేవలు అందడం లేదని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని అన్నారు. పిల్లల వైద్యసేవల విషయంలో డాక్టర్ శశికాంత్‌రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఆస్పత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్, తహసీల్దార్ నాగార్జున, డాక్టర్ రామకృష్ణ, కోల శ్రీనివాస్, తలారి రాజేష్, స్పందనసాగర్ రావు, మచ్చ శేఖర్, మున్నా, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
పేదప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం
జగిత్యాలరూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెడ్డు సంధ్య-డేవిడ్‌కు చెందిన ఇందిరమ్మ ఇళ్లును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, మాజీసర్పంచ్ బొల్లె సత్తమ్మ-గంగారాం, మాజీ ఎంపీటీసీ కర్నె భూమారెడ్డి, నాయకులు సదానందం, కాంతయ్య, మహిపాల్, విజయ్, గంగేష్, కొమురయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.
సిఎం సహాయనిధి అండ
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి): పేదరికం వల్ల ఉన్నత స్థాయి వైద్యం చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన జుంబర్తి రాహుల్, నరాలబలహీనతతో బడుతున్న బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన చుంచు మల్లేశంకు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మోతె మాజీసర్పంచ్ జుంబర్తి శంకర్, కౌన్సిలర్ చీటి లక్ష్మీనారాయణ, ప్యాక్స్ డైరెక్టర్ జుంబర్తి శంకర్, కొలగానీ సత్యం, ఆరుముల్ల శంకర్, బంద తిరుపతి పాల్గొన్నారు.