Share News

ఖరీఫ్‌ సాగుకు వేళాయె!

ABN , Publish Date - May 26 , 2026 | 12:54 AM

ఖరీఫ్‌ సాగుకు వేళయ్యింది. రోహిణికార్తె ఆగమనంతో యేటా వానాకాలం సీజన్‌ ఆరంభం అవుతుంది. రైతులు సాగుకు సన్నద్ధం అవుతారు. ఎలాంటి పంటలు పండిం చాలి, ఏ రకం విత్తనాలు వేయాలి, పంట పెట్టుబడుల సేకరణ తదితర విషయాలపై రైతులు తలమునకలు అవుతారు.

 ఖరీఫ్‌ సాగుకు వేళాయె!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఖరీఫ్‌ సాగుకు వేళయ్యింది. రోహిణికార్తె ఆగమనంతో యేటా వానాకాలం సీజన్‌ ఆరంభం అవుతుంది. రైతులు సాగుకు సన్నద్ధం అవుతారు. ఎలాంటి పంటలు పండిం చాలి, ఏ రకం విత్తనాలు వేయాలి, పంట పెట్టుబడుల సేకరణ తదితర విషయాలపై రైతులు తలమునకలు అవుతారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఖరీఫ్‌ సాగు ప్రణాళికను రూపొందించారు. అందుకు తగ్గ ట్లుగా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుక వచ్చేందుకు అంచనాలు తయారు చేశారు.

పంటల సాగు అంచనా...

ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,78,290 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారని అం చనా వేశారు. మూడు వానాకాలం సీజన్లలో సగటున 2,75,990 ఎకరాల్లో పంటలు సాగు చేశారని, ఈసారి అదనంగా 2,300 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకా శాలున్నాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ప్రతి సీజన్‌లో వరి, పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న పంటలు అధికంగా పండిస్తున్నారు. 2,15,500 ఎకరాల్లో వరి, 52,094 ఎకరాల్లో పత్తి, 886 ఎకరాల్లో మొక్కజొన్న, 208 ఎకరాల్లో కంది, 10 ఎకరాల్లో పెసర, 11 ఎకరాల్లో మినుములు, 12 ఎకరాల్లో ఇతర పంటలు, 2 ఎకరాల్లో వేరుశెనగ, 44 ఎకరాల్లో నువ్వులు, 3179 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌, 133 ఎకరాల్లో మిర్చి, 295 ఎకరాల్లో పసుపు, 376 ఎకరాల్లో ఇతర పప్పు దినుసులు, 5,128 ఎకరాల్లో కూరగాయలు, 415 ఎకరాల్లో ఇతర పంటలను రైతులు పండించనున్నారని అధికారులు అంచనా వేశారు.

ఈ పంటలకుగాను 31,138 మెట్రిక్‌ టన్నుల యూరియా, 3,767 టన్నుల డీఏపీ ఎరువులు అవసరం ఉంటాయని అంచనా వేశారు. కానీ పొటాష్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌, అతి కీలకమైన కాంప్లెక్స్‌ ఎరువుల ఎంత అవ సరం ఉంటాయనే విషయమై అంచనాలు రూపొందిం చలేదు. ప్రస్తుతానికి ప్రైవేట్‌ డీలర్లు, ఎరువుల దుకా ణాలు, మార్క్‌ఫెడ్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 11,821 టన్నుల యూరియా, 814 టన్నుల డీఏపీ, 496 టన్నుల పొటాష్‌, 611 టన్నుల సూపర్‌ ఫాస్ఫేట్‌, 10,114 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందు బాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి బత్తిన శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 53,125 క్విం టాళ్ల వరి విత్తనాలు, 1,31,250 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1.6 క్వింటాళ్ల పప్పు దినుసుల విత్తనాలు, 50 క్వింటాళ్ల పెసర విత్తనాలు అందుబాటులో ఉంచారు. భూమిలో భూసారం పెంచేందుకు వినియోగించే పచ్చిరొట్ట ఎరు వులు 14 వేల క్వింటాళ్లు అవసరం ఉంటాయని అం చనా వేశారు. కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులను సబ్సిడీపై అందజేయనున్నారు.

ఫ వరుణుడు కరుణిస్తేనే పూర్తిస్థాయిలో సాగు..

ఈ ఏడాది కూడా సకాలంలో వరుణుడు కరుణిస్తేనే పూర్తిస్థాయిలో పంటలు సాగు కానున్నాయి. గడిచిన మూడు వానాకాలం సీజన్లలో అనుకూలంగా వర్షాలు పడడంతో రైతులు యేటా సగటున 2,75,990 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈసారి అంతకు మించి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో ప్రధానంగా ఎస్సారెస్పీ సాగు నీటిపైనే ఆధారపడి రైతులు పంటలను సాగు చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా 20 వేల ఎకరాలకు పైగా సాగు నీళ్లు అందుతున్నాయి. వీటికి తోడు రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. అంతేగాకుండా చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులపై కూడా ఆధారపడి రైతులు లక్ష ఎకరాల్లో పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సా రెస్పీలో 12.07 టీఎంసీల నీళ్లు, శ్రీపాద ఎల్లంపల్లిలో 8 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సగానికి పైగా చెరువులు, కుంటల్లో కూడా వరి నార్లు పోసుకునేందుకు వీలుగా నీళ్లు ఉన్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రం లో ముందస్తుగానే ప్రవేశిస్తాయని వాతావరణ శాఖాధి కారులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండడంతో వివిధ వర్గాల ప్రజలు అతలా కుతలం అవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. రైతులంతా యాసంగి సీజన్‌లో పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునే పనిలో ఉండడంతో ఖరీఫ్‌ సీజన్‌ పనులను ఇంకా ఆరంభించ లేదు. ఆరుతడి పంటలను సాగు చేసే భూముల్లో వేసవి పొడి దుక్కులను దున్నుతున్నారు.

Updated Date - May 26 , 2026 | 12:54 AM