బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:07 AM
బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు అంద రూ సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమి షన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్ర వాల్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు అంద రూ సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమి షన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్ర వాల్ పిలుపునిచ్చారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివా హాల నివారణపై ‘బాల్య వివాహం.. బతుకు ఆగం’ పేరిట ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితెలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. బాల్య వివాహాల నివారణపై అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ పిల్లల హక్కుల సంరక్షణకు ముందు ఉంటామని స్పష్టం చేశారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు చైల్డ్ ఫ్రెండ్లీ అని కొయా డారు. ప్రతి కుటుంబంలో వారి మతపెద్దల పాత్ర ఎక్కువగా ఉంటుందని, లైంగిక వేధింపుల, బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించాలని పేర్కొ న్నారు. పిల్లలందరినీ చదివించేలా ప్రోత్సహించాలని సూచిం చారు. ఏ వయస్సు వారికి వివాహం చేస్తున్నామో కచ్చితంగా తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
బాల్య వివాహాలు చేస్తే జైలుశిక్ష, జరిమానా
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం 2006లో చట్టం చేసిందని, బాల్య వివాహం చేసే అందరికీ చట్టం ప్రకారం జైలుశిక్షలు, జరిమానా ఉంటుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సమాజంలో ప్రధాన మార్పులో అన్ని మతాల పెద్ద లు కీలకమని తెలిపారు.అన్ని కుటుంబాలకు మంచి మాటలు చెప్పి మార్పునకు సహకరించాలని పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు అమ్మాయి, 21ఏళ్లలోపు అబ్బాయికి పెళ్లి చేయవద్దని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీ-సెక్షన్ ఆపరేషన్లలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కాన్పు కోసం ఎలాం టి డేట్లు చెప్పవద్దని సూచించారు. ఏడాది కాలంలో 12 బాల్య వివా హాలు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. బాలల దత్తత కూడా చట్టప్రకారం తీసుకోవాలన్నారు.
బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వాలి
- ఎస్పీ మహేష్ బీ గితే
బాల్య వివాహాలపై 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ మహేష్ బీ గితే సూచించా రు. ఎక్కడైనా పెళ్లి సమాచారం తమకు వెంటనే ఇవ్వాలని తెలిపారు. అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువు, హక్కుల పరిరక్ష ణపై అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహా లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. బాల్య వివాహాలు చేస్తే రెండు ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు. బాల్య వివాహాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యా ధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్ తదితరులు పాల్గొన్నారు.