Share News

వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:42 AM

పోలీసులతో లాఠీచార్జీలు చేయిం చిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇప్పుడు జిల్లా దశాబ్ది ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం సిగ్గుచేటని జిల్లా ఉద్యమకారులు అన్నారు.

వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు..

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : పోలీసులతో లాఠీచార్జీలు చేయిం చిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇప్పుడు జిల్లా దశాబ్ది ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం సిగ్గుచేటని జిల్లా ఉద్యమకారులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద జిల్లా ఉద్యమకారులు(జిల్లా సాధన సమితి) ఆవి ర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బుస్స వేణు, చొక్కాల రాము మాట్లాడారు. జిల్లా కోసం నాడు పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్ల పాలైనా మన్నారు. ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జీలు, కేసులు, జైళ్లు, రౌడిషీట్లు పెట్టించిన నాయకులు ఇప్పుడు ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూర్చొని జిల్లా ఎట్లా సాధ్యం అన్న ఎమ్మెల్యే కేటీ ఆర్‌ ఇప్పుడు ఏ విధంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా వచ్చేంత వరకు ఢిల్లీలో ఉన్న ఆయనకు తెలియదని, జిల్లా ఉద్యమ తీవ్ర తను తెలుసుకున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు తలొగ్గి మళ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ గెలవడన్న భయంతో జిల్లాను ఇచ్చాడన్నారు. జిల్లా ఉద్యమంలోకి రాని బీఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం జిల్లా ఉద్యమకారులను పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి రాగుల జగన్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆకునూరి బాలరాజు, మున్నూ రుకాపు సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి ఎర్రం మల్లయ్య, కాంగ్రెస్‌ నాయకు లు నళినీకాంత్‌, దేవదాస్‌, ఇరుకుల్ల భాస్కర్‌, సంగం శ్రీనివాస్‌, ఉద్యమకారులు కత్తెర దేవదాస్‌, జలగం ప్రవీన్‌(టోని), రిక్కమల్లె మనోజ్‌, రాగుల రాములు, కం సాల మల్లేశం, కుసుమ విష్ణు, యెల్దండి రాజశేఖర్‌, దశరథం పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:42 AM