Share News

సెస్‌ను రద్దు చేయడం సరికాదు..

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:40 AM

ప్రభుత్వం సెస్‌ను రద్దు చేయడం సరికాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమా ర్‌ అన్నారు.

సెస్‌ను రద్దు చేయడం సరికాదు..

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం సెస్‌ను రద్దు చేయడం సరికాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమా ర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేక రుల సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడారు. సిరిసిల్ల సెస్‌ ఉందా లేదా అన్న స్పష్టత ఇవ్వాలని, జిల్లా ప్రజానికం అడుగుతు న్నారన్నారు. సిరిసిల్లకు వచ్చిన ఎన్‌పీడీసీఎల్‌ ఎండీ వరుణ్‌రెడ్డి పత్రిక ప్రకటన చేయడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారని అన్నారు. సెస్‌ కోఆపరేట్‌ మూమెంట్‌ను రద్దు చేస్తున్నారా లేదా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు నేరుగా చెప్పకుండా అటుగాకుండా ఇటుగాకుండా చెప్పడం ఏంటో అర్థం కావడంలేదన్నారు. ప్రభుత్వానికి చెప్పడానికి ధైర్యం లేదా మోసం చేయాలనుకుంటున్నారా...? అని ప్రశ్నించారు. సెస్‌కు రాష్ట్ర ప్రభు త్వం మార్చి 31నాటికి లైసెన్స్‌ రెన్యువల్‌ చేయలేదన్నారు. ప్రభు త్వం సెస్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేస్తుందా లేదా ఎన్‌పీడీసీఎల్‌లోకి వెళ్తుం దా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నాడు ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌ రావు, నర్సింగరావు నాటి ముఖ్యమంత్రి వెంటబడి సెస్‌ను వెనకబడిన మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు తీసుకువచ్చారని, అప్పటినుంచి సెస్‌ బ్రహ్మాండంగా నడుస్తుందన్నారు. సెస్‌లో నష్టాలు జరుగుతున్నాయన్న ది పచ్చిఅబద్ధమని సెస్‌కు రూ.700కోట్లు ప్రభుత్వమే బాకీ ఉందన్నా రు. నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ కాలంలో సెస్‌పై కుటిల రాజకీయ ఎత్తుగడలు గతంలో కూడా చాలా జరిగాయన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కూడా సెస్‌పై ఫిర్యా దులు చేస్తే సెస్‌ బ్రహ్మాండంగా నడుస్తుందని కేసీఆర్‌ పక్కన బెట్టార న్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు కూడా మళ్లీ వెళ్లినట్లు ఉన్నార ని, ముఖ్యమంత్రి వారి ఆలోచనలను పక్కన పెట్టాలని కోరారు. సోలర్‌ ఎనర్జి వస్తుందని సిరిసిల్ల ప్రాంతంలో కూడా సోలర్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తే రామగుండం కరెంట్‌ సెస్‌కు అవసరం ఉండదన్నారు.దీనిపై కేసు స్టడీగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల సెస్‌ను గ్రీన్‌ ఎనర్జీ కార్బన్‌ పాయింట్స్‌ వారు స్టడీ కూడా చేశారన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ 56 సంవత్సరాల సెస్‌ శ్రమను బురదల పోయవద్దన్నారు. సెస్‌ అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నా రు. సెస్‌ను రద్దు చేస్తే సెస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, అన్ని రాజకీయా పార్టీలు, మేధావులు, ప్రజలు, కార్మికులు, రైతు సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి మూమెంట్‌ తయారవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, నాయకులు బొల్లి రామ్మోహన్‌, మ్యా న రవి, ఎండీ సత్తార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:40 AM