వృద్ధులకు అండగా నిలవడం అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:39 AM
వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా దర్శనమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ మహేష్ బీ గీతే పేర్కొన్నారు.
గంభీరావుపేట, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా దర్శనమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ మహేష్ బీ గీతే పేర్కొన్నారు. గంభీరావు పేట మండల కేంద్రంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని శనివారం ఎస్పీ మహేష్ బీ గీతే సందర్శించారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధు లతో ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరా ణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరా శ్రయులు, అనాథల సంక్షేమంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించా లన్నారు. అనాథ అభాగ్యులకు అవసరమైన వారికి సేవ చేయడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడు ముందుంటుందని తెలిపారు. వృద్ధుల ఆశ్రమాన్ని నడుపుతున్న మల్లుగారి నర్సయ్యను అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేష్, ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.