బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత అందరిది
ABN , Publish Date - May 27 , 2026 | 12:06 AM
బాల్య వివాహాలను నివా రించే బాధ్యత అందరిపై ఉందని డీడబ్ల్యువో లక్ష్మీరాజం, డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
గంభీరావుపేట, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాల్య వివాహాలను నివా రించే బాధ్యత అందరిపై ఉందని డీడబ్ల్యువో లక్ష్మీరాజం, డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. గంభీరావుపేట గాయత్రి ఫంక్షన్ హాల్‌లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజం, నాగేంద్రచారి మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన తరువాతే యువతులకు పెళ్లి చేయాలని, చిన్న వయ స్సులో జరిగే పెళ్లిళ్ల వల్ల జన్యుపరమైన సమస్యలు తలెత్తుతాయన్నా రు. ఆడపిల్లలకు యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తున్నారని, అలా చేయడం వల్ల ఆరోగ్యపరమైన, మానసికపరమైన సమస్యలు వస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, మెడికల్ ఆఫీసర్ అభినయ్, సీడీ పీవో ఉమారాణి, సూపర్‌వైజర్ రేణుక, ఏపీఎం సుధా, సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.