ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:04 AM
ఓటు హక్కు వినియోగించుకో వడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, జనవరి 24(ఆంధ్రజ్యోతి) : ఓటు హక్కు వినియోగించుకో వడం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నా భారత దేశం -నా ఓటు (మై ఇండియా.. మై ఓట్) అనే థీమ్‌తో 16వ జాతీయ ఓట ర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లు, నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ శాలువాతో సన్మానించారు. అలాగే నూతన ఎపిక్ కార్డులు అందజేసి, అభినందించారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ జిల్లాలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు అందరి సహకా రంతో ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. భార త ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ నమో దు, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంక టేశ్వర్లు, రాధాభాయ్, సీపీవో శ్రీనివాసాచారి ఉద్యోగులు సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.