దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యం
ABN , Publish Date - May 07 , 2026 | 11:56 PM
దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమని, అందులో భా గంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలోనే దివ్యాంగుల కోసం రూ 100కోట్లకుపైగా వెచ్చించి ఉపకరణాలు అందించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ తెలిపారు.
సిరిసిల్ల, మే 7 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమని, అందులో భా గంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలోనే దివ్యాంగుల కోసం రూ 100కోట్లకుపైగా వెచ్చించి ఉపకరణాలు అందించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సినారె కళా మందిరంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) ఆర్థిక సహకా రంతో 466 మంది దివ్యాంగులకు రూ 84 లక్షల విలువైన 813 ఉపకరణాలను అందించారు. కలె క్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలు మంత్రి సంజయ్‌కుమార్‌ను స్వాగతించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఏడీఐపీ, అలింకో పథకాల కింద జిల్లాలో రూ 84 లక్షల కేంద్ర నిధులతో దివ్యాంగులకు 813 పరికరాల ను కొనుగోలు చేసి దివ్యాంగులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.. గతంలో కరీంనగర్‌లో, వేములవాడలో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున పరికరాలను పంపిణీ చేశామని గుర్తు చేశారు. త్వరలోనే మిగిన దివ్యాంగులందరికీ ఉపకర ణాలు అందిస్తామని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్దుల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమ లుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం, గుడ్డు సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, గుడ్లు, పాలతోసహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తూ గర్భిణు లు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగేలా చేస్తోందన్నా రు. వృద్ధులకు, దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటుందని, కరీంన గర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు గర్భిణీ, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం దాదాపు రూ 100 కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని అన్నారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరారు. అన్ని అవయ వాలున్న వాళ్లే అనేక ఇబ్బందులు పడుతున్నారని, దివ్యాంగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే వారు ఇబ్బందులను అధిగమించేలా చేసేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందన్నారు. అందులో భాగంగా దివ్యాంగులకు ఉపకరణాలు అం దిస్తున్నామని, రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదని, ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి అతిత్వరలో ఉపకరణాలు అందిస్తామన్నారు. గత 12ఏళ్లుగా దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కేంద్ర సామాజిక సాధికారత శాఖ ద్వారా వేలాది కోట్లను దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తోందని, ఈ ఒక్క ఏడాదే రూ 1600 కోట్లు కేటాయించిందని. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే 3రెట్ల బడ్జెట్‌ను అధి కంగా కేటాయిస్తున్నారన్నారు. దివ్యాంగులకు ఉప కరణాలను అందజేయడంతో పాటు విద్య, ఉపాధి, డిజిటల్ ఐడీ, యాక్సెసిబుల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వారి హక్కులను కాపాడటంలో ముందున్నామన్నారు.దివ్యాంగులు సంక్షేమానికి కృషి చేస్తున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులకు అభి నందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని, డ్రాప్‌ఔట్ ఉండవద్దని తెలి పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ మేరకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈఏడాది కూడా సైకిల్‌లు ఇస్తామని, ఈ ఏడాది విద్యార్థులకు 15 వేల సైకిళ్లు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. తాను ఎంపీ ఉన్నంత వరకు విద్యార్థులకు పైకిళ్లు ఇస్తాన ని అన్నారు.
ఉపకరణాలతో మరింత ముందుకు వెళ్లాలి
శిబిరంలో పంపిణీ చేసే ఉపకర ణాలను దివ్యాంగులు సద్వినియో గం చేసుకొని మరింత ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. సుగమ్య భారత్ ... స్వశక్త భారత్‌లో భాగంగా దేశ నిర్మాణం, అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందు కు జిల్లాలో ఆరు శిబిరాలు ఏర్పాటు చేశామని, వైద్య పరీక్షలు చేయించి అర్హులను గుర్తించామని తెలిపా రు. ఉపకరణాలతో దివ్యాంగులకు ఎంతోమేలు చేకూ రుతుందని వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో 10మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిలో యూడీ ఐడీ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని, వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రతి నెలా చేయిస్తున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో మహా శివరాత్రి సంద ర్భంగా భక్తులకు హెల్ప్‌డెస్క్ దివ్యాంగులకు సహా యం అందించామని గుర్తు చేశారు. సిరిసిల్లలోని డే కేర్ సెంటర్‌లో సేవలను దివ్యాంగులు ఉపయోగిం చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారాణి,ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఐఓసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వినీత్ కౌల్, హైద రాబాద్ సీఎస్‌ఆర్ హెడ్ కైలాస్‌కాంత్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, అలీం కో టీం ప్రతినిధి చందన్, దివ్యాంగుల యూనియన్ నాయ కుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.