Share News

గత ప్రభుత్వ హయాంలో సమస్యలు..

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:33 AM

గత ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలకు జరిగిందని, సమస్యలు పరిష్కారం కాలేదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో సమస్యలు..

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలకు జరిగిందని, సమస్యలు పరిష్కారం కాలేదని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆరోపించారు. సిరిసిల్లలో ఈనెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఎల్లారెడ్డిపేట మీదుగా వెళ్తున్న ఆయన మంగళవారం ఆ పార్టీ నాయకుడు నేవూరి వెంకట్‌రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు స్థానిక నాయకులు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనను అందిస్తోందన్నారు. ప్రజల మేలు కోరే ప్రభుత్వ పాలనను సాగిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ సిరిసిల్లలో చెరువు కరకట్టకు దళిత, బీసీ వర్గాలకు చెందిన సుమారు 300 ఎకరాల భూములను తీసుకుని కనీసం పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ప్ర శ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు తమ ఎదుట వాపోతున్నారన్నారు. కరకట్ట బ్యాక్‌వాటర్‌, సిరిసిల్ల పట్టణం లోని మురుగు నీరు వెళ్లే పరిస్థి తి లేక భారీ వర్షం కురుస్తే ము నిగిపోయే పరిస్థితి దాపురిస్తోందన్నారు. నేరేళ్ల అరాచకం మరిచిపోలేనిదని ఆ ఘటన యావత్‌ తెలంగాణకు తెలుసని, ఆ రోజు అప్పటి లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమారీ, టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. తాను కరీంనగర్‌ జిల్లా పరిషత్తు చైర్మన్‌గా ఉన్న సమయంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్‌ ఉన్నారని, సిరిసిల్ల నియోజకవర్గం సమస్యలపై తనను ఫోను చేస్తే సహకరించేవాడినని గుర్తుచేశారు. పార్టీలు వేరైన సమస్యల పరిష్కారానికి పాటుపడడం ప్రజా నాయకుడి లక్ష్యణమన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు రాజేందర్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, నర్సయ్య, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాపురెడ్డి, సాహెబ్‌, దేవేందర్‌, రాజిరెడ్డి, సురేందర్‌, బుచ్చాగౌడ్‌, గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:33 AM