చిన్నబోనాల గురుకులంలో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:47 AM
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చిన్నబోనాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరి ష్కరించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేపట్టారు.
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చిన్నబోనాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరి ష్కరించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు పరి ష్కరించడంలేదని, అక్కడి సమస్యలను తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేసిన విద్యా ర్థులపై అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నారంటూ విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రతినెల రెండవ శనివారం విద్యార్థులను కలుసుకునే అవకాశం కల్పిం చడంతో తల్లిదండ్రులు వచ్చారు. వారిని కలిసిన విద్యార్థులు విద్యాయ లంలో నెలకొన్న సమస్యలతోపాటు అన్నంలో పురుగులు వస్తున్నాయని, మరుగుదొడ్లు చెడిపోయి ఉండడంతో పాటు నీళ్లు కూడా రావడంలేదని తెలిపారు. అలాగే మురుగునీరు పోయేందుకు కాలువలు లేకపోవడం తో దుర్గధం వెదజల్లుతోందని, వసతులు లేక ఇబ్బందులు పడుతున్నా మని వాపోయారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ జేజే థెరి స్సాను కలిసి సమస్యలను విన్నవించగా ఆమె దురుసుగా ప్రవర్తించ డంతో తల్లిదండ్రులు ఆగ్రహించారు. పదిరోజుల క్రితం ఈ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ విద్యాలయాన్ని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకులంలో మెరుగైన వసతులతో పాటు ఉన్నత చదువులు నేర్పిస్తారని ఆశించి తమ పిల్లల ను చేర్పిస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైందికాదన్నారు. సమ స్యలను చెబుతున్న విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పంగరవి, నగేష్, సురేష్, రవీందర్, బాబు, శ్రీనివాస్, లక్ష్మీతోపాటు బీఅర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.