ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:59 AM
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు
కోరుట్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్ చేశారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ నాయకులతో కలిసి సుతారి రాములు మాట్లాడారు. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. ఈ దాడుల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆరోపించారు. సమస్యలను దౌత్యపరమైన చర్యల ద్వారా పరిస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఐక్యరాజ్యసమితి తక్షణమే ఖండించి జోక్యం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో ముక్రం, పలువురు నాయకులు పాల్గొన్నారు.