Share News

ప్రజా పాలనంటే అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలేనా..?

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:25 AM

రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం సమస్యలను పరిష్క రించాలంటూ ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్‌లు చేయడంతోపాటు నిర్భంధాలు చేయడమేనంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ డిమాం డ్‌ చేశారు.

ప్రజా పాలనంటే అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలేనా..?

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం సమస్యలను పరిష్క రించాలంటూ ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్‌లు చేయడంతోపాటు నిర్భంధాలు చేయడమేనంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌ డిమాం డ్‌ చేశారు. మంగళవారం చలో హైదరాబాద్‌కు పోతున్న కార్మికులను పోలీసులు అక్రమంగా అరె స్ట్‌లు చేయాడాన్ని ఖండిస్తూ బుధవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపీ కార్మికులతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయ తీ కార్మికులు కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలని సమ్మె చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రతి మండలంలో టెంటుల వద్దకు వచ్చి సంఘీ భావం తెలిపారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కనీస వేతనం అమలు చస్తామని అలాగే మల్టీఫర్పస్‌ విధానాన్ని రద్దు చేసి కార్మికుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా హామీలు అమలు చేయడం లేదన్నారు. గత మూడు నెలలుగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, నాయకులు ఎలిగేటి రాజశేఖర్‌,జీపీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, ముస్తాబాద్‌ మండల అధ్యక్షు డు గూడెం శ్రీనివాస్‌, గంభీరావుపేట మండల అధ్యక్షుడు అంజ య్య, ఇల్లం తకుంట మండల అధ్యక్షుడు మల్లయ్య, శ్రీనివాస్‌, రాజు, శంక ర్‌, లక్ష్మీ, మల్లవ్వ, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:25 AM