Share News

ప్రత్యామ్నాయమే పరిష్కారమా...

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:29 AM

నైరుతి రుతుపవనాలు జాడలేకుండా పోయాయి. వారంరోజులు ఆలస్యంగా ఈనెల 6న రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు మహబూబ్‌నగర్‌ తదితర సరిహద్దు జిల్లాలను దాటి ముందుకు కదలకపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. మృగశిర కార్తె ప్రవేశించి పదిరోజులు గడిచినా వర్షాలు కురవడంలేదు. రోహిణి కార్తె ఎండలను తలపించేలా 43 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈసారి ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండేట్టు కనిపిస్తున్నదని భావిస్తున్నారు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపినా అది కూడా అనుమానాస్పదమేనని భావిస్తున్నారు.

ప్రత్యామ్నాయమే పరిష్కారమా...

- జాడలేని రుతుపవనాలు

- వర్షాల కోసం ఎదురు చూపులు

- పంటల ప్రణాళిక మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

నైరుతి రుతుపవనాలు జాడలేకుండా పోయాయి. వారంరోజులు ఆలస్యంగా ఈనెల 6న రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు మహబూబ్‌నగర్‌ తదితర సరిహద్దు జిల్లాలను దాటి ముందుకు కదలకపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. మృగశిర కార్తె ప్రవేశించి పదిరోజులు గడిచినా వర్షాలు కురవడంలేదు. రోహిణి కార్తె ఎండలను తలపించేలా 43 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈసారి ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండేట్టు కనిపిస్తున్నదని భావిస్తున్నారు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు తెలిపినా అది కూడా అనుమానాస్పదమేనని భావిస్తున్నారు. ప్రతి వర్షాకాలం జిల్లాలో 2.7 లక్షల ఎకరాల నుంచి 2..8 లక్షల ఎకరాల వరకు వరి, మరో 40 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తారు. ఈసారి కరువు వాతావరణం నెలకొనే సంకేతాలు కనిపించడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.

ఫ రైతులకు అవగాహన కల్పించి..

వరి స్థానంలో కంది, పెసర, మినుముల వంటి పప్పు దినుసులు, సజ్జలు, రాగులు, నువ్వుల వంటి చిరు ధాన్యాలు, జొన్నలు లాంటి పంటలను సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. మొక్కజొన్న పంట ఎక్కువగా వస్తున్నందున ఆ పంటతో తయారయ్యే ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. ఆ దిశగా రైతులను చైతన్యవంతం చేసేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పడు వాతావరణ అంచనాలను వివరించాలని, యాప్‌ ద్వారా ఎరువుల బుకింగ్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

ఫ యూరియా పక్కదారి పట్టకుండా

యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌)లు లేని చోట రైతు వేదికల ద్వారా యూరియా అమ్మకాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో 10 రైతు వేదికల ద్వారా యూరియా అమ్మకాలు చేపట్టగా ఈయేడాది వాటి సంఖ్యను 14కు పెంచాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. మరోవైపు వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలను గ్రామాల వారిగా రైతులకు వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు. పండ్ల తోటలు, పూల తోటలు, ఆయిల్‌ ఫామ్‌ సాగు చేస్తే లాభాలు గడించవచ్చని, ఇప్పటి వరకు ఆయా రంగాల్లో సక్సెస్‌ అయి అధిక లాభాలు గడించిన వారివిజయగాథలను రైతులకు వివరించనున్నారు.

ఫ ముందస్తు ప్రణాళికతో సన్నద్ధం కావాలి..

- కలెక్టర్‌ చిత్రామిశ్రా

ముందస్తు ప్రణాళికలతో వానాకాలం వ్యవసాయానికి సిద్ధం కావాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్య, ఉద్యాన వనశాఖల ప్రస్తుత పరిస్థితి, రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్దతపై అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 01:29 AM