Share News

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:20 AM

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల(సెస్‌) జూని యర్‌ కళాశాల, సాయిశ్రీ జూనియర్‌ కళాశాల, సహస్ర జూనియర్‌ కళాశా లలో(నాలుగు) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు విద్యార్థులు సమయానికంటే అరగంట ముందే చేరుకు న్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లను తనిఖీ చేశాకే పరీక్ష హాల్‌లోకి సిబ్బంది అనుమతినిచ్చారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం రెగ్యులర్‌ విద్యార్థు లతో పాటు ప్రైవేటు విద్యార్థులు మొత్తం జిల్లా వ్యాప్తంగా 4328 మంది విద్యార్థు లకు 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 119 మంది విద్యార్థు లు గైర్హాజరయ్యారు. పోలీస్‌ బందోబస్తు మధ్య ఇంటర్‌ ఫస్టియర్‌ మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

Updated Date - Feb 26 , 2026 | 12:20 AM