ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:55 PM
తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయ నున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకా నికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 13 (ఆంరఽధజ్యోతి): తెలం గాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయ నున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకా నికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవి త బీమా పథకం సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రణాళిక శాఖ, ఆర్థిక సెక్రెటరీ గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్న తాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరి సిల్ల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకం దేశంలోనే వినూత్నమైనదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిం చిందని తెలిపారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కు టుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి రూ 5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధా ని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథ కాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రారంభిస్తారని తెలిపారు. ఈనెల 14వ తేదీన జవహర్లాల్ నెహ్రూ జయంతి నుంచి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన తాజా కులగణన సర్వే ద్వారా కుటుంబాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సమర్థవం తంగా వినియోగించుకోవాలని తెలిపారు.
ప్రత్యేక నమోదు కేంద్రాలు
ఈనెల 19వ తేదీన ప్రతి గ్రామం, మున్సిపల్ పరిధిలో వార్డుల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి కుటుంబాల వివరాలు సేకరించా లని ఆదేశించారు. ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత ప్రచారంచేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని తెలి పారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ కుటుంబానికి సంబంధించి న జీవిత బీమా కవరేజీ కుటుంబ సభ్యుల వివ రాలను కచ్చితంగా సేకరించాలని సూచించారు. దరఖాస్తులో జిల్లా, మండలం, గ్రామం లేదా వార్డు వివరాలతో పాటు బీమా పొందే వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్ నంబర్లు కూడా సేకరించాలన్నారు.కుటుం బానికి సంబంధించిన జీ విత బీమా కవరేజీ కోసం 18 నుంచి 59 సంవత్సరా ల వయసు గల కుటుంబ సంపాదన సభ్యుల వివ రాలను కచ్చితంగా సేక రించాలన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని, దరఖా స్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం ఈనెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయా లని సూచించారు. సూపర్ వైజర్లు, జిల్లా స్థాయి అధికారులను నియమించాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ ప్రక్రియ తదితర అంశాల కోసం కావాల్సిన సిబ్బంది, పరికరాలు అందుబాటులో పెట్టాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ అధికా రి, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుల స్వీకరణ పై తమ పరిధిలో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో లక్ష్మీనా రాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్ర య్య, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకే ష్ తదితరులు పాల్గొన్నారు.