Share News

ఎరువులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:38 PM

మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఎరువులు విత్తనాల దుకాణాల్లో తనిఖీలు
అలుగునూర్‌లోని విత్తనాల దుకాణంలో తనిఖీ చేస్తున్న జేడీఏ చత్రు నాయక్‌

తిమ్మాపూర్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదారాబాద్‌ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్‌ పాల్గొని రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల వ్యాపారులు తప్పనిసరిగా అధీకృత హోల్‌సెల్‌ డీలర్ల వద్ద నుంచే నాణ్యమైన ఎరువులను కొనుగోలు చేయాలన్నారు. నకిలీ లేదా నాసికరం ఎరువులను విక్రయించినా, అనుమతి లేని మార్గాల్లో నిల్వలు తెప్పించినా దుకాణాల లైన్‌న్సులను తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. రైతులకు ప్రతి కొనుగోలుపై విధిగా రశీదు ఇవ్వాలని, స్టాక్‌ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మానకొండూర్‌ ఏడీఏ శ్రీధర్‌, ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్‌, మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:38 PM