Share News

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:37 AM

వినాయక నిమజ్జనంలో మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జనంలో మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్ల కొండ లక్ష్మణ్‌ బాపూజీ చౌరస్తా సమీపం ప్రేమ్‌నగర్‌ మానేరు వాగు తీరాన వినాయక నిమజ్జనానికి చేస్తు న్న ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బిగితే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి, డీఎస్పీ నాగేంద్రచారి పరిశీలించారు. వినాయక నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీలకు మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మా ట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు గణేష్‌ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో మానేరు తీరానికి తరలించాలన్నారు. వినాయక నిమజ్జనంలో ప్రతిఒక్కరు ప్రభుత్వ అధికారులకు సహకారించాలని సూచించారు. ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి మాట్లాడుతూ వినాయక నిమజ్జన మహో త్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు, మండపాల నిర్వాహకులకు ఇబ్బందు లు ఏర్పడకుండా మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ఏర్పాట్లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫెడ్‌, జిల్లా మత్సశాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్‌ మహేష్‌, సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, కాంగ్రెస్‌ ఫోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళప్రభాకర్‌, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:37 AM