Share News

సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:19 AM

సిరిసిల్ల జిల్లా కేంద్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ను బుధవారం ఎస్పీ మహేష్‌ బీగీతే పరిశీలించారు.

సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల జిల్లా కేంద్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ను బుధవారం ఎస్పీ మహేష్‌ బీగీతే పరిశీలించారు. ఈనెల 30న సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌, పార్కింగ్‌ల కోసం ప్రదేశాలను పరిశీ లించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వీవీఐపీ, వీఐపీ భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటేశఽ్వర్లు, టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఈఈ శాంత య్య, ఎస్‌ఐలు గణేష్‌, నాగరాజు, రాజు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:19 AM