స్కానింగ్ సెంటర్ల తనిఖీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:37 PM
హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని ప్రైవేట్ డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదాస్ సోమవారం తనిఖీ చేశారు.
హుజూరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని ప్రైవేట్ డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుదాస్ సోమవారం తనిఖీ చేశారు. ఈ నెల 25న ‘వైద్యం పేరుతో నిలువు దోపిడీ’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో రికార్డులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్ సెంటర్లలో అర్హత లేకుండా పనిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమ అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రుల అనుమతులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్డ్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు.