రిసెప్షన్ కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:56 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పా టు చేసిన రిసెప్షన్ కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
సిరిసిల్ల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పా టు చేసిన రిసెప్షన్ కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సిరిసిల్ల సినారె కళామందిరంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి బుధవారం రాత్రి పరిశీ లించారు. అలాగే వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఇన్‌చార్జి కలెక్టర్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీవో డైరీ తీసుకుంటుండగా ఇన్‌చార్జి కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీ ల్దార్ జయంత్ కుమార్, సీపీవో శ్రీనివాసచారి తదితరులు ఉన్నారు.