ఎరువుల దుకాణాల తనిఖీ
ABN , Publish Date - May 29 , 2026 | 11:54 PM
మండలంలోని అలుగునూర్ రైతు డిపో, సీఎస్సీ సొసైటీ ఎరువుల దుకాణాలను ఎల్‌ఎండీ ఎస్సై సయ్యద్ అన్వర్, మండల వ్యవసాయధికారి సురేందర్ శుక్రవారం తనిఖీ చేశారు.
తిమ్మాపూర్, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలుగునూర్ రైతు డిపో, సీఎస్సీ సొసైటీ ఎరువుల దుకాణాలను ఎల్‌ఎండీ ఎస్సై సయ్యద్ అన్వర్, మండల వ్యవసాయధికారి సురేందర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశామని తెలిపారు. ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకన్నా ఎక్కువకు అమ్మినా, ఇతర ఉత్పత్తులను అంటకట్టినా ఎరువుల దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వానాకాలం సీజన్‌లో రైతులకు కావలసిన యూరియూ, డీఏపీ, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.