ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:43 PM
ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అన్ని మౌలిక వసతులను కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అన్ని మౌలిక వసతులను కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం యాసంగి సీజన్ సందర్భంగా జిల్లాలోని 22ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల ఆధ్వర్యంలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండ గా, సంఘాల కార్యదర్శులు, సెంటర్ల ఇన్‌చార్జీలు, ట్యాబ్ ఆపరేటర్‌లతో కొనుగోలుపై శిక్షణ అందించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపా యాలను కల్పించాలన్నారు. కొనుగోలుకు సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలని, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఈనెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాలని, అవరసమైన గన్నీ బ్యాగ్‌లను సమార్చుకోవాలని, కేటాయించిన రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. శిక్షణలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి తదిరులు పాల్గొన్నారు.