పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:30 AM
జిల్లాలో జరిగే ఇంటర్మీడి యెట్ పరీక్ష కేంద్రాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జరిగే ఇంటర్మీడి యెట్ పరీక్ష కేంద్రాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం జిల్లా ఇంటర్మీడియేట్ అధికారిని కలిసి వినతిపత్రాన్ని అందిం చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొన్ని ప్రైవేటు కళాశాలలు ఫీజు కట్టకుంటే హాల్‌టికెట్ ఇవ్వమని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఖచ్చితంగా ఫీజు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారని అరో పించారు. జిల్లా అధికారులు వెంటనే అలాంటి కళాశాలలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు హాల్ టికెట్‌లు రాలేదని భయంతో అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులందరికి హాల్ టికెట్ ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఇంటర్మీడియేట్‌పరీక్ష కేంద్రాల్లో విద్యా ర్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలని తాగునీరు, విశాలమైన గదు లు, ఫ్యాన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జూలపల్లి మనోజ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.