Share News

రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:43 AM

జిల్లాలో రోడ్ల విస్త రణ, అభివృద్ధి పనులు చేపడుతున్న తరుణంలో ఆ రోడ్లపై ఉన్న టీఫైబర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు ముందుగా సమాచారాన్ని సంబం ధిత అధికారులు అందించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వాలి

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్ల విస్త రణ, అభివృద్ధి పనులు చేపడుతున్న తరుణంలో ఆ రోడ్లపై ఉన్న టీఫైబర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు ముందుగా సమాచారాన్ని సంబం ధిత అధికారులు అందించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో బుధవారం నిర్వహిం చిన జిల్లాస్థాయి టెలికాం కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్‌ నిర్వ హించి డిజిటల్‌ భారత్‌నిధి(డీబీఎన్‌), రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌, టెలి కాం టవర్లకు విద్యుత్‌ సరఫరా, భారత్‌నెట్‌ ఇన్‌ఫ్రాకాల్‌ బీఫోర్‌యూడీజీ మొబైల్‌ అప్లికేషన్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న టీఫైబర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారు లకు సమాచారం ఇవ్వడం వలన వైర్లు చెడిపోకుండా ఆయా సంస్థల అధికారులు సంరక్షణ చర్యలు చేపడుతారన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమీషనర్‌లు ఖదీర్‌పాషా, లోకేష్‌, మిషన్‌ భగీరఽథ ఈఈలు అన్వర్‌, సుమలత, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:43 AM