Share News

గత ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు నిర్వీర్యం

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:57 AM

గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే సిరిసిల్ల ప్రాంతంలోని డైయింగ్‌, సైజిం గ్‌, వార్పిన్‌ పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయ ని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు నిర్వీర్యం

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే సిరిసిల్ల ప్రాంతంలోని డైయింగ్‌, సైజిం గ్‌, వార్పిన్‌ పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయ ని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రం శివనగర్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయం లో జరిగిన సమావేశంలో సిరిసిల్ల డైయింగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం సభ్యులు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడా రు. సిరిసిల్ల అంటేనే నేతన్నలు అందులో కాటన్‌ తరువాతే అనే రకాల వస్త్ర పరిశ్ర మలు వచ్చాయన్నారు. మనిషితో పుట్టింది కాటన్‌ వస్త్రం దానికి అనుబంధంగా డైయింగ్‌, సైజింగ్‌, వార్పిన్‌ పరిశ్రమ లు వచ్చాయన్నారు. కాటన్‌ పరిశ్రమ నిర్వీర్యం కావడంతో కార్మికులు పొట్ట చేత పట్టుకొని వివిధ వృత్తులోకి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ రూ.370కోట్లు బతుక మ్మ చీరల బకాయిలు పెట్టిపోవడంతో చేనేత పరిశ్రమను కుంగదీసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం బకాయిలను చెల్లించిందన్నారు. కాటన్‌ వ్యవస్థకు పునర్జీవం పోయాలని వస్త్ర పరిశ్రమ పెద్ద లు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులతో సమీక్షించి సిరిసిల్లకు ఏడు కోట్ల 50లక్షల మీట ర్ల ఇందిరా మహిళా శక్తి చీరల వార్పును జతచేస్తూ ఉత్పత్తి చేయడం కోసం ఆర్డర్లను ఇచ్చిందన్నారు. పాలిస్టర్‌ పరిశ్రమ తో పాటు కాటన్‌ పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు కార్మికు లు సంతోషం వ్యక్తం చేశారన్నారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి మంత్రి అయి ఉండి కూడా కార్మికులు, ఆసా ముల బతుకుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించా రు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలకు మూలాలను పరిశీ లించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అందరి ఆలోచనలను పరిగణనలోకి తీసుకు న్నందుకు గాను కృతజ్ఞతగా సైజింగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపినం దుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, నాయకులు చక్రధర్‌రెడ్డి, వైద్య శివప్రసాద్‌, సిరిసిల్ల సైజింగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌడ సురేష్‌, ఉపా ధ్యక్షుడు వేముల వెంకటనర్సయ్య, కార్యదర్శి గాజుల రవి, నాయకులు గౌడ రాజు, తాటిపాములు దామోదర్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 12:57 AM