ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:16 AM
జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ ప్రదేశంలో లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి, ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అధికారులకు సూచించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలి
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతమ్
జగిత్యాల టౌన, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని నూకపల్లి డబుల్ బెడ్‌రూమ్ ప్రదేశంలో లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి, ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుదవారం పరిశీలించిన ఆయన అక్కడి ప్రజలతో మాట్లాడి ఏర్పాట్లు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగిత్యాల పట్టణంలోని 15వ వార్డు గాంధీనర్‌లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర గృహనిర్మాణ గౌతమ్ మాట్లాడుతూ మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. అనంతరం పలు మార్కింగ్, బెస్మెంట్, స్లాబ్ లెవెల్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఇళ్ల లబ్దిదారులతో నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణాలు తర్వగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేసుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన, మున్సిపల్ కమిషనర్ స్పందన, అధికారుల పాలొన్నారు.
ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయండి
కొడిమ్యాల: ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఇంకా ప్రారంభించని వాటిని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఎండీ సంబందిత అధికారులతో పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులను కలిసి మీకు బిల్లులు ఎన్ని వచ్చాయి. ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగారు. లబ్ధిదారులు బిల్లులు వస్తున్నాయని ఇబ్బందులు లేవని పలువురు తెలిపారు. ఎండీ వెంట చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, హౌజింగ్ పీడీ ప్రసాద్, డీఈఈ భాస్కర్, ఎంపీడీవో స్వరూప, తహసీల్దార్ కిరణ్‌కుమార్, హౌజింగ్ ఏఈ సిందు, ఉప సర్పంచు గుర్రం నర్సాగౌడ్, పంచాయతీ సభ్యుడు నర్సింగరావు, ఏపీఎం మల్లేశం, ఏపీవో సతీష్, కార్యదర్శి వంశీవర్దన, సీసీ వీరకుమార్ పాల్గొన్నారు.