Share News

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:05 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి

సిరిసిల్ల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడు మొదలుపెట్టారని ఆరాతీశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరగా ఇళ్లు పూర్తిచేసుకోవాలని అన్నారు. గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని సూచించారు. హౌ సింగ్‌, మున్సిపల్‌ అధికారులు ఇళ్ల నిర్మాణాల ఫోటోలు ఎప్పటిక ప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. వెంట హౌ సింగ్‌ పీడీ సాజిద్‌, తహసీల్దార్‌ మహేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రం తనిఖీ

ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు, పరిశీలనలో తహసీల్దార్‌ మహేష్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:05 AM