పండుగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:54 AM
గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల సందడి కనిపిస్తుండటం చాలా సంతోషంగా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
సారంగాపూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల సందడి కనిపిస్తుండటం చాలా సంతోషంగా ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని లచ్చక్కపేట, పోచంపేట గ్రామాల్లో జంగం మానస రాజేష్, మాజీ సర్పంచ కృష్ణరెడ్డి, తోపారపు లక్ష్మీరాజనర్సయ్య, తిరుమ జ్యోతి శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇళ్లులేని నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గృహ ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో మరో విడత ఇళ్ల నిర్మాణాల జాబితాను అర్హులైన వారికి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ సలీం, సర్పంచలు జగదీష్, ఆకుల రమేష్, రమ్య భాస్కర్, దామెర రుషేంద్ర శంకర్‌రెడ్డి, కొలపాక రాధ రాజు, నాయకులు గురునాథం మల్లారెడ్డి, కోల శ్రీనివాస్, తోడేటి శేఖర్ గౌడ్, రమేష్, మనోహరెడ్డి, మ్యాకల శేఖర్, తోట లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
బీర్‌పూర్: మండలంలోని మంగేళ గ్రామానికి చెందిన మహేందర్ వైష్ణవి ఇందిరమ్మ గృహప్రవేశం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రిబ్బన కత్తరించారు. కార్యక్రమంలో కెడీసీసీ జిల్లా మాజీ మెంబర్ ముప్పాల రాంచందర్‌రావు, సర్పంచ సతీష్, నాయకులు నరేందర్, రమేష్, మహిపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రాయికల్: నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన దీకొండ గౌతమి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ఆదివారం ఎమ్మెల్యే హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన కట్కం రవీందర్, సర్పంచ, మున్సిపల్ మాజీ చైర్మన మోర హన్మాండ్లు, పలుగ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.