ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:17 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కాలంలో పూర్తిచేసి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వంద ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు.
సిరిసిల్ల రూరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కాలంలో పూర్తిచేసి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో వంద ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వవార్డు పెద్దూర్‌లో నిర్మిస్తున్న ఇందరమ్మ ఇళ్లను గురువారం అధికారులతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ పరిశీలించారు. పెద్దూర్ గ్రామంలో బడుగు లక్ష్మి, బడుగు బాబు సునీత, కత్తెర లక్ష్మి, బడుగు ప్రియాంకలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ స్వయంగా వెళ్లి లబ్దిదారులతో మాట్లా డారు. ఇళ్లు ఎప్పుడు మొదలు పెట్టారు, ప్రభుత్వ సహా యం అందుతుందా అనే తదితర వివరాలు అడిగి తెలుసు కున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 808 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, వాటిలో 554 ఇళ్లకు ముగ్గు పోశారని, 461 ఇళ్లకు బేస్ మెంట్ లెవెల్, 326 గోడల లెవెల్ లో, 250 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని అన్నారు. ముగ్గు పోసిన వారితో పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించాలని అధికారు లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. అధికారులతో సమన్వయం చేసు కొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇళ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా పాల్గొన్నారు.