ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:54 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, గ్రామ సమాఖ్య, గ్రామ పంచాయతీ భవ నాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, టాయిలెట్ల నిర్మాణాలపై మున్సిపల్ కమి షనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పీఆర్, హౌసింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈనెలాఖరు వరకు మెగా గృహప్రవేశ కార్యక్రమానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారి సమస్య లు పరిష్కరించాలని తెలిపారు. వడ్రంగి, ప్లంబర్, మేస్త్రి ఇతర ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం సూచించిన బడ్జెట్‌లోనే ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని తెలి పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, ఆయా మండలాల్లో గుడిసెల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణాల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల ని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయమై జడ్పీ డిప్యూ టీసీఈవో, హౌసింగ్. ఇతర అధికారులను కలెక్టర్ అభినందించా రు. ఇదే స్ఫూర్తితో జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు ఇళ్లను పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలో గ్రామ సమాఖ్య భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్ర భవనాల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని భవనాలను పూర్తిస్థా యిలో వినియోగించుకునేలా వసతులు కల్పించిన తర్వాత ప్రారంభిం చాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటమాధ వరావు, డీఆర్డీవో గీత, హౌసింగ్ డీఈ సాజిద్, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, పశువైద్య, సంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.