ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:03 AM
ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు. కోనరావుపేట మండ లం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్‌రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కు ర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇన్‌చార్జి కలె క్టర్ గరిమ అగ్రవాల్ మంగ ళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇళ్లు మంజూ రుకాగా, 460 ఇళ్లకు ముగ్గు పోయగా, బేస్‌మెంట్ లెవెల్‌లో 401 ఇళ్లు, 325 ఇళ్లు గోడల వరకు, 287 ఇళ్లు స్లాబ్ లెవెల్‌లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇన్‌చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్‌కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్ధిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అం దుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధి కారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు.