Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:56 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్‌, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముం దుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మండ లాల వారిగా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 7408 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. 5571 ఇళ్లకు ముగ్గు పోశామని, 4544 ఇళ్లు బేస్మెంట్‌ స్థాయిలో, 3193 ఇళ్లు గోడల లెవెల్‌ లో, 2370 ఇళ్లు స్లాబ్‌ లెవెల్‌లో ఉన్నాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ వెల్లడించారు. ఇళ్లను నిర్మించుకునేందుకు ముగ్గు పోసిన వారితో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్‌, గోడలు, స్లాబ్‌ లెవెల్‌కు చేరిన ఇళ్లను పనులు పూర్తి చేసేలా అధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడా లని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ప్రతి ఎంపీడీవో ప్రతిరోజూ10 ఇళ్ల పురోగతిని పరిశీలిం చాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించారు.జిల్లాలోని ఏదో ఒక మండ లంలో ఆకస్మిక తనిఖీ చేస్తానని ఇన్‌చార్జి కలెక్టర్‌ తెలి పారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందు బాటులో ఉండేలా..సరైన ధరకు వచ్చేలా హౌసింగ్‌ అధి కారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పనులు చేసేవారి వివరాలు, ఫోన్‌ నంబర్లు అందుబాటులో పెట్టుకుని లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచిం చారు. లబ్ధిదారుల నుంచి ఇంటి నిర్మాణ పనులకు అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని వెళ్లిపోయిన మేస్ర్తీలపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు వినియోగించుకునేందుకు అ వకాశం ప్రభుత్వం కల్పించిందని దాని ని సద్వినియోగం చేసుకునేలా చూడా లని ఎంపీడీవోలకు సూచించారు. పురో గతిలో ఉన్న ఇళ్ల ఫోటోలు ఎప్పటికప్పు డు హౌసింగ్‌ ఏఈలు ఆన్‌లైన్‌లో అప్‌ లోడ్‌ చేయాలని, లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ప్రతి డబ్బు జమ అవుతున్నా యని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లపై వచ్చిన దరఖాస్తులను ఆయా ఎంపీడీ వోలు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, బోయినపల్లి మండలంలో 23 ఇందిరమ్మ ఇళ్లు, తంగళ్ళపల్లి మండలంలో 14 ఇళ్లను పూర్తి చేయించిన ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులను అభినందించారు. రానున్న నెల రోజుల్లో జిల్లాలో 280 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు సి ద్దంచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శంకర్‌, మండల ప్రత్యేక అధికారులు గీత, అఫ్జల్‌ బేగం, లక్ష్మీ రాజం, రవీందర్‌రెడ్డి, హనుమంతు, షరీఫుద్దిన్‌, రామ కృష్ణ, క్రాంతి, నజీర్‌ అహ్మద్‌, ఎంపీడీవోలు, ఏఈలు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:56 PM