Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:26 AM

సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రుచేస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

సిరిసిల్ల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రుచేస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తెలిపారు. గురు వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యం లో మొదటి విడత కింద మంజూరైన నిర్ణీత సమయంలో ఇళ్లు నిర్మించుకోని వారి స్థానంలో నూతనంగా 710 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ధ్రువపత్రాల పంపిణీని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించా రు.జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, ఆయా మండలాల లబ్ధిదారులకు స్టాళ్లు ఏర్పాటు చేసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. స్టాళ్లలో పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవే రుస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదవాడి సొంతఇంటి కల నెరవేరుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో కూలీల కు ఉపాధి, వివిధ వృత్తుల వారికి పని, దుకాణదారులకు వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం విజయవంతంగా అ మలుచేస్తున్నామని వెల్లడించారు.పథకాల అమలులో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఉందని తెలిపారు.

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల..

సొంత ఇల్లు నిర్మాణం ప్రతి ఒక్కరి కలగా ఉం టుందని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన వారు ప్రభు త్వం నిర్ణయించిన విస్తీర్ణంలో ఇల్లుకు త్వరితగతిన ముగ్గు పోసుకోవాలని సూచించారు. ప్రతి మం డలకేంద్రంలోని మోడల్‌ హౌస్‌లను తప్పనిసరిగా సందర్శిం చాలని, ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సహాయంతోనే ఇల్లు పూర్తి చేసుకోవాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ నాగుల సత్యనారాయణ గౌడ్‌, సిరిసిల్ల, వేములవాడ ము న్సిపల్‌ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గం ఇం చార్జ్‌ కేకే మహేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడెపు చంద్రకళ, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తిరుపతి, ఎల్లయ్య, రాజు, స్వరూప, సబేరా బేగం, రాణీ, రాములు నాయక్‌, వి జయ, హౌసింగ్‌ పీడీ వెంకట మాధవరావు, సిరిసిల్ల ఆర్డీ ఓ శ్రీధర్‌బాబు, తహసీల్దార్‌ మహేష్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:26 AM