Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:36 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఇందిరమ్మ ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండల పరిషత్‌ కార్యాల యంలో జగిత్యాల రూరల్‌ మండలా నికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల మండలంలో 794 ఇళ్లు మంజూరుకాగా 529 ఇండ్లకు పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నరేష్‌, ఎంపీఓ రవిబాబు, సూపరిండెంట్‌ చౌడారపు గంగాధర్‌, సర్పంచులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధికి కృషి

బీర్‌పూర్‌: గ్రామ పంచాయతీ అభివృద్దికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవణ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇటివల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తుంగూర్‌ సర్పంచ్‌ గెలిచిన అర్షకోట రాజగోపాల్‌ రావ్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా గ్రామ పంచాయతీ భవన నిర్మానానికి స్థలాన్ని అఫిడవిట్‌ రూపంలో పంచాయతీరాజ్‌ డీఈ మిలింద్‌కు అప్పగిం చారు. గ్రామ పంచాయతీ నిర్మాణానికి 20లక్షల నిధులు మంజూరు కావడంతో ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ కేడీసీసీ జిల్లా మెంబర్‌ రాంచంధర్‌ రావ్‌, ఉప సర్పంచ్‌ శీలం లింగన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:36 AM