Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - May 02 , 2026 | 12:34 AM

అర్హులైన ప్రతి కుటుంభానికి ఇందిరమ్మ ఇంటిని ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఇల్లంతకుంట, మే 1(ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి కుటుంభానికి ఇందిరమ్మ ఇంటిని ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం అని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని చిక్కుడువానిపల్లె, పొత్తూరు గ్రామాలలో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు గత ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వడంలో విఫలం చెందిందన్నారు. గ్రామసభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డీనేటర్‌ పాశం రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రమణారెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, సర్పంచ్‌లు చింతమడక కళ్యాణ్‌, చొప్పరి భూమయ్య, మామిడి రాజు, నాయిని నవీన్‌కుమార్‌, అరుకాల నవీన్‌, నాయకులు చిక్కుడు సత్యం, రమేష్‌, కేతిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆకుల సత్యం, తీగల పుష్పలత, రాంప్రసాద్‌రెడ్డిలతో పాటు నాయకులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:34 AM