Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:51 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
లబ్ధిదారులకు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని నియోజకవర్గంకు 3500 ఇండ్లను కేటాయించి చరిత్ర సృష్టించారన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను వేగవంతంగా నిర్మించుకుని తమ కలను సాకారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌, ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు ఎంతో ప్రయోనం చేకూర్చుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్‌ పూండ్ర నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు న్యావనంది శేఖర్‌, ఎగ్యారపు శ్రీహరి, పులి హరిప్రసాద్‌, చెట్‌పల్లి ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:51 AM