ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:02 AM
దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం గాంధీచౌక్ వద్ద మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటా నికి నాయకులు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయం సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడారు. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి గా దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. పేద ప్రజల జీవితాలల్లో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ ఎనలేని సేవలందించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాన్ని నాయకులు ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు వేముల దామోదర్, రాగుల జగన్, కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళప్రభాకర్, కౌన్సిలర్లు వెంగళ లీలాలక్ష్మీ నర్సయ్య, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనర్సయ్య, పత్తిపాక లక్ష్మీ రాజం, పోచ్చమ్మ దేవాలయం చైర్మన్ పరశురాములు, నాయకులు బైర ప్రభా కర్, కంసాల మల్లేశం, గుజ్జె రమేష్, మల్లేశం, యాదగిరి, చందన, లక్ష్మన్, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.