Share News

పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:32 AM

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలను తగ్గించాలని మధ్యాహ్న భోజన కార్మికులు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో శనివారం ధర్నా కార్య క్రమం చేపట్టారు.

పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

బోయినపల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలను తగ్గించాలని మధ్యాహ్న భోజన కార్మికులు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో శనివారం ధర్నా కార్య క్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మిడ్‌ డే మీల్స్‌ నాయకులు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తు న్నా గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపిందన్నారు. నిత్యావసర ధరలను పెంచి సామాన్య పేద మధ్య తరగతి కార్మిక వర్గంపై మోయలేని భారాన్ని మోపిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్‌ కంపెనీలు, పెట్టుబ డిదారులు, ప్రపంచ బ్యాంకుకు వత్తాసు పలుకుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని, లేన యెడల ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి బడా పెట్టుబడిదారులకు, బడా కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకువచ్చిందన్నారు. 12 గంటలు పని చేయాలని సంఘం పెట్టే హక్కు లేకుండా కనీస వేతన చట్టాలు అమలు కాకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం వెంటనే 44 కార్మిక చట్టాలను అమలు చేస్తూ, నాలు గు లేబర్‌ కోట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు వంట చేస్తున్న కార్మికులకు గ్యాస్‌ ధరలను పెంచి పేద పిల్లలకు వంట చేయకుండా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మీస లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షురాలు నడిబొట్టు లక్ష్మి, విమల, లింగంపల్లి శంకరయ్య, రాజేశ్వరి, కవిత, పూజ వీరయ్య, వెంకటయ్య, మల్లయ్య, నర్సవ్వ, శంకరయ్య, లక్ష్మి, రాజవ్వ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:32 AM