ఎడతెరిపి లేని వర్షం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:54 AM
ఎల్‌నినో ప్రభా వంతో కరువు పరిస్థి తులను ఎదుర్కొంటున్న రైతుల్లో వర్షానందం కలిగింది.
సిరిసిల్ల, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభా వంతో కరువు పరిస్థి తులను ఎదుర్కొంటున్న రైతుల్లో వర్షానందం కలిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులు గా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పత్తి, మొక్కజొన్న వంటి ఆరు తడి పంటలకు జీవం వచ్చింది. వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు దాటి నా సమృద్ధిగా వర్షం లేక మందకొడిగా సాగుతున్న వరి నాట్లు కురుస్తున్న వర్షాలకు జోరు పెరిగింది. మరోవైపు జిల్లాలోని చిన్నచిన్న ఒర్రెలు పారుతు న్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జిల్లా లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సరాసరి 46.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేము లవాడ రూరల్‌లో 34.3 మిల్లీమీటర్లు, బోయిన్‌పల్లిలో 32.0 మిల్లీమీటర్లు, వేములవాడలో 27.0 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 26.5 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 25.0 మిల్లీమీటర్లు, చందుర్తిలో 23.8 మిల్లీమీటర్లు, సిరిసిల్ల లో 21.3 మిల్లీమీటర్లు, తంగళ్ళపల్లిలో 19.5 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 19.0మిల్లీమీటర్లు, రుద్రంగిలో 15.8మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 12.8 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 11.5 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 0.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి పాల్వంచ వాగు నుంచి వరద నీరు వస్తోంది. జిల్లాలోని ప్రధానమైన మిడ్ మానేరు ప్రాజెక్టులోకి మానేరు, మూలవాగుల నుంచి 4556 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.57 టీ ఎంసీల నీటి నిల్వఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మేడారం, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు 6300 క్యూసెక్కు ల నీటిని ఎత్తిపోస్తున్నారు. అన్నపూర్ణ ప్రాజెక్టు సామర్థ్యం 3.50టీఎంసీలకు 1.46టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 125 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. రెండు రోజుల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మూలవాగులో వరద నీరు ప్రవహిస్తోంది. ఇల్లంతకుంటలో సిరికొండ చెరువు ఒర్రె, ఎల్లా రెడ్డిపేట, వీర్నపల్లి, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి మం డలాల్లో పలు ఒర్రెలు పారుతున్నాయి. ఎల్లారెడ్డిపేటలో వర్షానికి మల్లయ్య అనే వ్యక్తి ఇల్లు దెబ్బతింది. కాగా, జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో పత్తి, మొక్కజొన్న, పెసర, కంది, కూరగాయల పంటలకు జీవం వచ్చింది. వరి నాట్ల జోరు పెరిగింది. జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతులు, ఇప్పటివరకు 1,28,499 ఎకరాల్లో పంటలు సాగు చయగా, 75,660 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. పత్తి 46,225 ఎకరా లు, కంది 1,393 ఎకరాలు, మొక్కజొన్న 2,797 ఎకరాలు, జొన్న 990 ఎకరా లు పెసర 1,434 ఎకరాల్లో సాగు చేశారు.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. బుధవారం మండల కేంద్రాలతో పాటు అక్కపల్లి, వన్‌పల్లి, గర్జనపల్లి, తదితర గ్రామాల శివారుల్లోని లేతమామిండ్ల, మూల వాగులు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు కుంటలు, చెరువుల్లోకి వచ్చి చేరుతోంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కోనేటి మల్లయ్యకు చెందిన ఇంటి పైకప్పు వర్షానికి స్వల్పంగా కూలిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షంనీరు నిలవడంతో వాహనదారులకు ఆటం కంగా మారింది. పలు గ్రామాల్లో సాగు పనులు జోరందుకున్నాయి. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్లు సుజాత, నారాయణరెడ్డిలు, సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ లక్ష్మణ్‌లు హెచ్చరించారు.
ఇల్లంతకుంట : మండలంలో భారీవర్షం కురియడంతో రైతులు సంతో షం వ్యక్తంచేస్తున్నారు. నారుపోసి రోజులు గడిచిపోతున్నా నీరులేక ఇబ్బం దిపడిన రైతులు నాటువేసుకోవచ్చని అంటున్నారు. పత్తి రైతులకు పూర్తిగా అనుకూలంగా వర్షం పడిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సిరికొం డ సమీపంలోని గుడ్డేలుగా ఒర్రె, చెరువు ఒర్రెలు ప్రవహించాయి. తాళ్ళల్ల పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వరదనీరు నిలువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇల్లంతకుంట ఎస్సీ కాలనీ సమీపంలోని రోడ్డుపై నీరు నిలిచింది.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రా జెక్టులోకి వరదనీరు మొదలైంది. అల్పపీడనం ప్రబావంతో ఎగువప్రాంతం లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని పల్వంచ వాగు పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఎగువ మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ మానేరు జలాశయంలోకి వరద నీరు వసుం్తడ టంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తం 31ఫీట్ల నీటి సామర్థ్యం గల మానేరులో ఇప్పటికే 17 ఫీట్ల నీరు ఉండగా, వరద నీటితో ప్రస్తుతం 18ఫీట్లకు చేరింది. మానేరు నీటి మట్టం క్రమంగా పెరగనుంది.
వేములవాడ : వేములవాడ పట్టణంలో వర్షానికి రోడ్లు, కాలనీలు జ లమయంగా మారాయి. మంగళవారంరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వ్యాపార దుకాణాలు మూసి ఉన్నాయి. వర్షం కారణంగా భీమన్న, రాజన్న ఆలయ సమీపంలోని వ్యాపారులు దుకాణాలను తెరవక పోవడంతో పట్టణం నిర్మానుష్యంగా కనిపించింది. జాతర గ్రౌండ్ సమీపం లో సైతం వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఒర్రె లు, కాలువలోకి స్వల్పం గా నీరు చేరుతుంది.
కోనరావుపేట : మండలంలో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో చెరువుల్లోకి నీరు చేరడంతోపాటు వ్యవసాయ పనులు ఊపందుకు న్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మండలంలో సమృద్ధిగా వర్షం పడటంతో వరినాట్లు ఊపందుకున్నాయి. వర్షంలోనే రైతులు వరినాట్లు వేస్తున్నారు. చెరువుల్లోకి నీరు చేరడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళపల్లెలో బతుకమ్మ కుంట నుంచి మారుపాక చెరువులోకి సమృద్ధిగా నీరు చేరుతుంది. రెండు రోజు లుగా పడుతున్న వర్షం వల్ల రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
వేములవాడ రూరల్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండ లంలోని పలు వాగులు ప్రవహిస్తున్నాయి. హన్మాజిపేట నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మల్లారం మూలవాగు మత్తడి దుంకుతోంది. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ హన్మాజిపేట నక్కవాగు, మ ల్లారం మూలవాగు వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉంటాయనుకున్న నేపఽథ్యంలో వర్షా లు పడడం ఆనందంగా ఉందన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వ ర్షాల వల్ల రైతన్నలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షా లు కురవాలని కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రులతో కలిసి గరి ప్రదక్షిణ చేసామని, గురువారం రాజన్న ఆలయంలో మంత్రులతో కలిసి వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మల్లారం స ర్పంచ్ సంగెం అర్పితవీరారెడ్డి మల్లారం చెక్‌డ్యాంకు స్వల్ప మరమ్మతు లు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సామతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోయినేని కరు ణాకర్, సర్పంచ్ రంగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ : రెండురోజులుగా ఎడతెపిరిలేకుండా కురుస్తున్న వర్షా లకు వేములవాడలో మూలవాగు ప్రవహిస్తోంది. బతుకమ్మతెప్ప వద్ద మూలవాగు అలుగు దూకుతుంది. మూలవాగు ప్రవహిసుండడంతో పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
చందుర్తి : మండల వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా కురు స్తున్న వర్షంతో ఒర్రెలు, వంకలు బుధవారం పొంగిపొర్లుతున్నాయి. లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గ్రామాల్లోని లోతట్టు కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తొలగిస్తున్నారు. మూడపల్లి, మర్రిగడ్డ తదితర గ్రామాల్లోని పత్తి చేనులలో వరదనీరు నిలిచింది. మూడపల్లి గ్రామంలో ఒర్రె వరద నీటితో ప్రవహిస్తుంది. ఓవైపు వర్షం కురుస్తుండడంతో మర్రిగడ్డలో రైతులు మాత్రం వర్షంలోనే వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.