Share News

ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:41 AM

ప్రతి గ్రామానికి మెరుగైన రవా ణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం

చందుర్తి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రతి గ్రామానికి మెరుగైన రవా ణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండలంలోని కొత్తపేట గ్రామానికి వేములవాడ డిపో నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ బుధవారం బస్సు కు పూజలు నిర్వహించి, జెండా ఊపి సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కొత్తపేట గ్రామం ఏర్పడిన నాటినుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లి వారి సహకారంతో ఈ నూతన బస్సు సర్వీస్‌ను ప్రారంభించామన్నారు. కొత్తపేట నుంచి రుద్రంగి మీదుగా వేములవాడ వరకు ప్రజలు కోరుకున్న సమయాల్లో బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సర్వీస్‌తో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, వ్యాపారులు, భక్తులు ఎంతో ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. గ్రామానికి బస్సు సౌకర్యం రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వేములవాడ నుంచి ఇప్పటికే ముంబై, భద్రాచలం, కాళేశ్వరం, యాదగి రిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుక వచ్చామని, త్వరలోనే వేములవాడ నుంచి బాసరకు నూతన బస్సు సర్వీస్‌ ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టు బడి ఉందని స్పష్టం చేశారు. కొత్తపేట గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. త్వరలోనే గ్రామానికి నూత న రహదారి, వంతెన నిర్మాణం చేపడతామన్నారు. మహిళా సమైక్య సంఘానికి రూ.10లక్షలు మంజూరుచేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కొత్తపేట గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపి క చేసి, ఇల్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తు న్నామన్నారు. రానున్న రోజుల్లో కొత్తపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌ బోనాల శ్రీనివాస్‌, సర్పంచ్‌ నరేష్‌, రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చేలుకల తిరుపతి, నాయకులు గొట్టె ప్రభాకర్‌, చింతపంటి రామస్వామి, గండి నారాయణ, పీఆర్‌వో శ్రీనివాస్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:41 AM