ఆకట్టుకున్న మోడల్ పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:58 AM
పచ్చని తోరణాలు.. ఆకర్షించే ప్రవేశ ద్వారాలు ఇరువైపులా పూల కుండీలు, రెడ్‌కార్పెట్‌లతో పెండ్లి వేడుకలకు ఆహ్వానించినట్లుగా పోలిం గ్ కేంద్రాలను తీర్చిదిద్దారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పచ్చని తోరణాలు.. ఆకర్షించే ప్రవేశ ద్వారాలు ఇరువైపులా పూల కుండీలు, రెడ్‌కార్పెట్‌లతో పెండ్లి వేడుకలకు ఆహ్వానించినట్లుగా పోలిం గ్ కేంద్రాలను తీర్చిదిద్దారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడ మున్సిప ల్ పోలింగ్ సందర్భంగా నాలుగు కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చామా, పెండ్లికి వచ్చామా అన్నట్లుగా మారింది. రెండు మున్సిపాలిటీలో 175 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు ప్రత్యేకపోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలోని శివనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోడల్ కేం ద్రం పోలింగ్ కేంద్రం, గాంధీనగర్ బాలరక్షభవన్‌లో గ్రీన్ పొలింగ్ కేం ద్రం ఏర్పాటుచేశారు. వేములవాడ మున్సిపాలిటీలో వేములవాడ ప్రభు త్వ పాఠశాలలో గ్రీన్ పోలింగ్ కేంద్రం, అంబేద్కర్ నగర్‌లో మోడల్ కేంద్రంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ కేంద్రాల వద్ద దివ్వాంగులు, గర్భిణులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీల్‌చైర్‌లు, టాయ్‌లెట్‌లు, మరుగుదొడ్లు సదుపాయాన్ని కల్పించారు. వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. షామియానాలు, కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మోడల్ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేలు పరిశీలించారు.
ప్రత్యేక ఆకర్షణగా సెల్ఫీ పాయింట్
మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీక్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోని ఓట ర్ల కోసం సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున యువతీయువకులు, దంపతులు సెల్ఫీపాయింట్‌ల వద్ద ఫొటోలు తీసు కున్నారు. వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో మిత్రులకు పంపించుకున్నారు.