Share News

ప్రశాంత వాతావరణంలో గణనాథుల నిమజ్జనం..

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:21 AM

గణనాథుల నిమజ్జనాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు.

ప్రశాంత వాతావరణంలో గణనాథుల నిమజ్జనం..

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యో తి) : గణనాథుల నిమజ్జనాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో చేపట్టాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ కోరారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగం గా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గణనాఽథునికి బుధవారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ ప్రత్యేకపూజలు చేశా రు. అనంతరం చేపట్టిన అన్నదానంలో పాల్గొని కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బందికి భోజనాన్ని కలెక్ట ర్‌ స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సీపీవో శ్రీనివాసచారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం,జిల్లా ఉద్యా నవన అధికారి శరత్‌బాబు, జిల్లా యువజన శా ఖఅధికారి రాందాస్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు రాం రెడ్డి, శ్రీకాంత్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : సిరిస్లిల 3వ వార్డులోని గణే ష్‌ యూత్‌ అసోసియేషన్‌ వినాయక మండపం వద్ద బుధవారం అన్నదానం కార్యక్రమాన్ని నాఫ్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూర రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి ప్రారంభించా రు. విద్యానగర్‌ అభయాంజనేయ వెల్ఫేర్‌ సొసై టీ వినాయక మండపం వద్ద అన్నదానం కార్యక్ర మాన్ని నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన అన్న దాన కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, అభయాంజనేయ వెల్ఫేర్‌ సొ సైటీ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్‌, ప్రధాన కార్య దర్శి పెన్యాల యెల్లరెడ్డి, కోశాధికారి శేఖర్‌, సభ్యు లు పాల్గొన్నారు.

రుద్రంగి : మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, హనుమాన్‌ యూత్‌ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన గణనాథుడికి బుధవారం 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కరస్పాడెంట్‌ ఎలిగేటి నరేష్‌, డైరెక్టర్‌లు తిపిరెడ్డి వేంకట్‌రెడ్డి, ఎర్రం గంగన ర్సయ్య, పడాల సురేష్‌, ప్రిన్సిపాల్‌ హరినాద్‌రా జు, ఉపసర్పంచ్‌ మాడిశెట్టి అభిలాష్‌ పాల్గొన్నా రు. మండలకేంద్రంలో గణనాథులకు విడ్కోలు శోభాయాత్ర ఘనంగా జరిగింది.

Updated Date - Sep 24 , 2026 | 12:21 AM